హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ సంస్థ చైర్మన్ రిచర్డ్ రూసో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డితో గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
సోలార్ పవర్‌పై విస్తృతంగా చర్చించారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో విద్యుత్తు రంగంలో తమ సంస్థ పనిచేస్తుందని రిచర్డ్ రూసో వారికి వివరించారు.