హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభు త్వం ‘రెండేండ్ల పాలన-విజయాలు-వైఫల్యాలు’ అనే అంశంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గోసుల శ్రీనివాస్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ రియాజ్, ఎంవీఎఫ్ నేషనల్ కన్వీనర్ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, దళితసేన రాష్ట్ర అధ్యక్షుడు జేబి రాజు, సీనియర్ జర్నలిస్టు పరాంకుశం వేణుగోపాలస్వామి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నాయకులు, ఎన్జీవో ప్రతినిధులు, సామాజిక వేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.