కోటపల్లి, సెప్టెంబర్ 14 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రా పనపల్లిలోని అంగన్వాడీలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల వివరాల ప్రకారం.. అంగన్వాడీలో మూడు రోజుల క్రితం కోడిగుడ్లను పంపిణీచేశారు. వాటిని ఆదివారం పిల్లలకు అందించేందుకు ఉ డకబెట్టగా దుర్వాసన వచ్చింది. గుడ్లను పగులకొట్టగా కుళ్లిపోయి ఉ న్నాయి. కుళ్లిన గుడ్లను సమ్మయ్య అనే వ్యక్తి ఫొటో తీసి గ్రామంలోని వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు. ఇ లాంటి కుళ్లిన గుడ్లను తింటే గర్భిణు లు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అం గన్వాడీ సూపర్వైజర్ను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ ద్వారా వివరణ కోరగా తన దృష్టికి రాలేదన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 17నుంచి పోషణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు చిన్నారులు, మహిళల్లో పోషకాహార అవశ్యకతపై నెలరోజులపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు లేఖ లు రాశారు. కార్యక్రమాల నిర్వహణకు ఐసీడీఎస్ ప్రాజెక్టుకు రూ. 30 వేలు, ప్రతి జిల్లాకు రూ. 50 వేలు విడుదల చేసినట్టు వెల్లడించారు. పోషకాహార మాసోత్సవాల్లో జంక్‌ఫుడ్ తగ్గింపు, నూనె, చక్కెర, ఉప్పు వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.