కాసిపేట, నవంబర్ 9 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి పంచాయతీలోని కొత్త తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2న అంగన్వాడీ కేంద్రం నుంచి కోడిగుడ్లు పంపిణీ చేశారని, ఆదివారం ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసి చూస్తే కుళ్లిపోయి కనిపించాయని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేశారు. నాసిరకం కోడిగుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.