హైదరాబాద్: ఎల్బీనగర్ హస్తినాపురంలో ఉన్న సంతోషిమాత (Santhoshi mata) గుడిలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి మెడలో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన పూజారి.. అమ్మవారి నగలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.