బియ్యం సేకరణలో కేంద్రం కొర్రీలు
- రోడ్డెక్కిన రైస్‌మిల్లర్లు, కార్మికులు
- హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా
హనుమకొండ, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బియ్యం సేకరణలో కొర్రీలు పెట్టడంతోపాటు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైస్‌మిల్ పరిశ్రమ రోడ్డున పడిందని ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. 48 రోజుల నుంచి ఎఫ్‌సీఐ సీఎంఆర్ సేకరణను నిలిపేయడంతో మిల్లులు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో యజమానులు, మిల్లు ఉద్యోగులు, హమాలీలు, కార్మికులు ఆందోళనకు దిగారు. వెంటనే బియ్యం సేకరణ ప్రారంభించాలని, జరిగిన నష్టాన్ని పూడ్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏకశిలా పార్కు నుంచి వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్రం బియ్యం సేకరించే విషయంలో పంతాలకు పోయి ఇబ్బందులు స్పష్టిస్తున్నదని ఆరోపించారు.
సేకరణ నిలిపేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల వద్ద వానకాలానికి 30 లక్షల టన్నులు, యాసంగికి సంబంధించిన సు మారు 50 లక్షల టన్నుల వడ్లు పేరుకుపోయాయని తెలిపారు. కేంద్రం ఆకస్మికంగా బియ్యం సేకరణ నిలిపివేయడంతో రాష్ట్రం లో వెయ్యి బాయిల్,్డ 2500 రా రైస్ మిల్లులు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. భారీవర్షాలకు ధా న్యం తడిసి మొలకలు వచ్చాయని తెలిపారు. బియ్యం సేకరణ తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని, ఈ నష్టానికి మిల్లర్లను బాధ్యులు చేయొద్దన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతి ప త్రాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు అందజేశారు. ఆం దోళనలో వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గోనెల రవీందర్, కోశాధికారి తకెళ్లపల్లి యుగంధర్, జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా రమేశ్, మాధవశంకర్, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు దేవునూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Ricemillers
- Warangal
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

