హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు రోడ్డుసౌకర్యంతోపాటు, వివిధ జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచేందుకు సంబంధిత శాఖలు పారదర్శకంగా స్పందించాలని అటవీశాఖ కోరింది. సరైన అనుమతులు ఉంటేనే యూజర్ ఏజెన్సీలు పనులను ప్రారంభించేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, జాతీయ రహదారుల విభాగం అధికారులతో పీసీసీఎఫ్ (అటవీ అనుమతులు) ఎంసీ పర్గెయిన్ అరణ్యభవన్‌లో బుధవారం సమావేశం అయ్యారు.
కేంద్ర అటవీశాఖ ప్రాంతీయ అధికారి (చెన్నై) త్రినాథ్‌కుమార్ సమావేశానికి హాజరై అటవీ అనుమతుల విధానంలో పాటించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 36, పీఎం గ్రామ సడక్ యో జన 40, జాతీయ రహదారులు 5, ఆర్అండ్బీ 5, జాతీయ రహదారులు మంత్రిత్వశాఖ 19, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఫేజ్-2లో 32, ఫేజ్-3లో 21 రహదారులకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు.