యాచారం, ఫిబ్రవరి 4 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీ రోడ్డు పనులను కొందరు రైతులు బుధవారం అడ్డుకున్నారు. హైకోర్టు స్టే ఉన్న భూముల్లో పనులు ఎలా నిర్వహిస్తారని వారితో వాగ్వాదానికి దిగారు.
ఇక్కడ పనులు నిర్వహించేందుకు వీలు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను జేసీబీ, హిటాచీ, డోజర్లు, టిప్పర్లను అక్కడి నుంచి పంపించారు. కోర్టు స్టే ఉన్న భూముల్లో అక్రమంగా రోడ్డు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.