
సూర్యాపేట: రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన సూర్యాపేటలో కలకలం రేపింది. చిలుకూరు శివారులోని మిట్స్ కళాశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రోడ్డుపై వేగంగా వెళ్తున్న రెండు బైకులు ఒకదాన్నొకటి బలంగా ఢీకొట్టాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిని కోదాడకు చెందిన షేక్ గౌస్ నసీమా దంపతులుగా గుర్తించారు. వీరిద్దరూ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు.