నారాయణఖేడ్, నవంబర్ 5: కర్ణాటకలోని బీదర్ జిల్లా హల్లిఖేడ్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్కు చెందిన రాచప్ప(55), కాశీనాథ్ (60), నవనాథ్ (27), ప్రతాప్తోపాటు మనూరు మండలం ఎల్గోయికి చెందిన నాగరాజు(37) మంగళవారం రాత్రి కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా గానుగాపూర్ పుణ్యక్షేత్రానికి కారులో బయలుదేరారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని గాపూర్లో దర్శనం ముగించుకుని అర్ధరాత్రి తి రుగు ప్రయాణమయ్యారు. హల్లిఖేడ్లో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో కాశీనాథ్, నవనాథ్, నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా, రాచప్పను దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు.