చిక్కడపల్లి, సెప్టెంబర్ 6: ఆర్ఎంపీ, పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ, సర్టిపికెట్లు ఇవ్వాలని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 36వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులు మారుమూల గ్రామాలు, గిరిజన, బస్తీ, ప్రాంతాల్లో ప్రజలకు 24 గంటలపాటు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. కానీ నేడు తమపై అక్రమ కేసులు పెడుతూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మె ల్సీ కోదండరాం, తదితరులు పాల్గొన్నారు.