Narender Reddy : బీఆర్ఎస్ పార్టీ (BRS party) మాజీ ఎమ్మెల్యే (Former MLA) పట్నం నరేందర్‌రెడ్డి (Patnam Narender Reddy) కి హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. లగచర్ల ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటిని హైకోర్టు కొట్టేసింది. ఒక కేసును మాత్రం కొట్టివేయకుండా వదిలేసింది.
లగచర్ల ఘటన నేపథ్యంలో బొంరాస్‌పేట పోలీసులు నరేందర్ రెడ్డిపై మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌లో పెట్టిన హైకోర్టు శుక్రవారం ఉదయం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.