కాంగ్రెస్‌కు ‘పట్టభద్రుల’ భయం
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో భారీగా ఓటరు నమోదు పెరుగడం కాంగ్రెస్‌లో గుబులు రేపుతున్నది. పట్టభద్రులు పెద్దసంఖ్యలో ఓటు నమోదుకు ముందుకు రావడంతో అధికార పార్టీని ఓటమి భయం తీవ్రంగా కలవరపెడుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో ఓటు నమోదు కార్యక్రమానికి వీలైనంత దూరంగా ఉన్నది. ఓటర్ల సంఖ్య పెరిగే కొద్దీ అది ముమ్మాటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారి ఫలితాన్ని తారుమారు చేస్తుందని భయపడుతూ వచ్చింది.
- పెరిగిన ఓట్లు.. ‘హస్తా’నికి ఓటమి గుబులు
- ఓటరు నమోదులో అధికార పార్టీ నిరాసక్తత
- ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందనే భయం
- 2021తో పోలిస్తే రెండు నియోజకవర్గాల్లోనూ దాదాపు 1.50 లక్షల వరకు పెరిగిన దరఖాస్తులు
- రెండు స్థానాల్లో పది మంది మంత్రులకు పరీక్ష
- ఉద్యోగులు, నిరుద్యోగుల్లో అసంతృప్తిపై కలవరం
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో భారీగా ఓటరు నమోదు పెరుగడం కాంగ్రెస్‌లో గుబులు రేపుతున్నది. పట్టభద్రులు పెద్దసంఖ్యలో ఓటు నమోదుకు ముందుకు రావడంతో అధికార పార్టీని ఓటమి భయం తీవ్రంగా కలవరపెడుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో ఓటు నమోదు కార్యక్రమానికి వీలైనంత దూరంగా ఉన్నది. ఓటర్ల సంఖ్య పెరిగే కొద్దీ అది ముమ్మాటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారి ఫలితాన్ని తారుమారు చేస్తుందని భయపడుతూ వచ్చింది.
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా అధికారంలో ఉన్న పార్టీ తమ అనుకూల ఓటర్లను పెద్ద సంఖ్యలో నమోదు చేయించేందుకు ప్రత్యేక శిబిరాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అధికార పార్టీ శ్రేణులు పూర్తిగా నిరాసక్తత కనబరిచాయి. క్షేత్రస్థాయిలో ఓటు నమోదును ఉద్దేశపూర్వకంగానే తగ్గించాలని చూసినట్టు ప్రచారం జరిగింది. పట్టభద్రులు, యువత పెద్దసంఖ్యలో జాబితాలోకి ఎకితే ఆ ఓట్లన్నీ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా తమకే వ్యతిరేకంగా పోలవుతాయని పార్టీ పెద్దలు భావించారు.
అయితే, ఇప్పడు వారి భయమే నిజం కాబోతున్నట్టు తెలుస్తున్నది. 2021లో వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఇప్పటివరకు రెండు నియోజకవర్గాల్లో కలిపి సుమారు 1.50 దరఖాస్తులు అధికంగా వచ్చాయి. అభ్యర్థులు నామినేషన్లు వేసేవరకు ఓటరు నమోదు అవకాశం ఉండటంతో మరో 1-2 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ గణాంకాలే హస్తం పార్టీ నేతల్లో ఓటమి గుబులు రేపుతున్నాయి. మరోవైపు ఉద్యోగులంతా కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, డీఏ, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై సర్కార్‌ను నిలదీస్తున్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపుతామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ కొంపముంచేలా ఉన్నాయని అధికార పార్టీ పెద్దలు కలవర పడుతున్నారు.
కర్ణాటక ఫలితాలతో కలవరం
పట్టభద్రులు, విద్యావంతుల ఓటింగ్ సరళి సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ విధానాలు, ఉద్యోగ కల్పన, పాలన వంటి అంశాలపై ఈ వర్గాలు స్పష్టమైన అభిప్రాయంతో ఉంటాయి. కర్ణాటకలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురైన ప్రతికూల ఫలితాలు తెలంగాణ నేతల్లోనూ చర్చకు దారితీసినట్టు తెలుస్తున్నది. అకడి పరిణామాలు ఇకడా పునరావృతమైతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అదే తరహా రాజకీయ చైతన్యం తెలంగాణలోనూ వ్యక్తమైతే పరిస్థితి తలకిందులవుతుందని, కర్ణాటక ఫలితాల ప్రతికూల ప్రభావం ఇకడి పట్టభద్రులపై స్పష్టంగా పడుతుందని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది.
మంత్రులకు అగ్నిపరీక్షే
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ రెండు స్థానాలు ఏకంగా పది మంది మంత్రుల ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి జిల్లాల పరిధిలోకి వస్తాయి. దాదాపు సగం మంత్రివర్గానికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఈ రెండు స్థానాల్లో గనుక అధికార పార్టీ పరాజయం పాలైతే, రాబోయే ఎన్నికలతోపాటు భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమనే వాతావరణం ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
విద్యావంతులు తీర్పు ఇచ్చే ఎన్నికలు కాబట్టి, దీన్ని ప్రభుత్వంపై రిఫరెండంగానే భావిస్తారు. ఇలాంటి కీలక సమయంలో ఫలితం తేడా కొడితే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న పట్టు సడలిపోతుందనే భయం మంత్రులను వెంటాడుతున్నట్టు తెలిసింది. రెండు స్థానాల్లోనూ ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా రాకపోతే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నది. ఈ తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్ వ్యూహకర్తలు ఓటర్ల సంఖ్య పెరిగితే ప్రభుత్వానికి నష్టమని భావించి, ఓటరు నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొనకుండా మిన్నకుండిపోతున్నట్టు చర్చ జరుగుతున్నది.
ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత
క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి అంశాల్లో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు నిరుద్యోగ యువతలో నోటిఫికేషన్ల జాప్యం, ఉద్యోగ నియామకాల ప్రక్రియ అటకెక్కడంపై వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గ్రాడ్యుయేట్ ఓటర్లలో అత్యధిక శాతం ఉద్యోగులు, యువత, నిరుద్యోగులే కావడంతో వీరంతా కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని నిఘా వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదించినట్టు ప్రచారం జరుగుతున్నది.
తమిళనాడు తరహాలోనే చదువుకున్న వర్గాలు తిరగబడితే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోక తప్పదని స్వయంగా ముఖ్యనేత గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మళ్లీ గుర్తుకొస్తున్నాయని అంటున్నారు. ఎన్నికల్లో కీలకంగా ఉండే ఈ రెండు వర్గాల అసంతృప్తి కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది. పట్టభద్రుల ఓటర్లు ప్రభుత్వ పనితీరును బేరీజు వేసి ఓటు వేస్తే ఫలితాలు అధికార పార్టీకి ప్రతికూలంగా మారవచ్చనే చర్చ జరుగుతున్నది.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

