హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నది. వర్చువల్ విధానంలో భేటీ జరుగనున్నది. ఈ సందర్భంగాలో రబీలో సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. సమావేశంలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలు, అధికారులు పాల్గొననున్నారు.
ఖరీఫ్‌లో ఈ నెల 15వ తేదీ దాకా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 11.77 టీఎంసీలు, కుడికాలువ కింద 2.55 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5.22 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి కోసం 4.14 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి కేటాయించాలని కోరుతూ కేఆర్ఎంబీ ఏపీ ఈఎన్సీ లేఖ రాశారు. భేటీలో తెలంగాణ సైతం ఏ మేరకు నీళ్లు కావాలో వివరాలు అందించనున్నది. సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చించిన అనంతరం, కమిటీ ఉత్తర్వులు ఇవ్వనున్నది.