ఇల్లంతకుంట, జూన్ 2: ‘కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే ఎమ్మెల్యేకు డబ్బు సంచులు మోయాల్సిందే.. లేదంటే పార్టీ నుంచి పీకి పారేసుడే’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి వాపోయారు. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీలో విశ్వాసంతో పనిచేసిన వారికి విలువ ఇవ్వకుండా, పదవులు కావాలని డబ్బులు ఇచ్చే వారికే పార్టీలో ప్రాధాన్యత ఎక్కువైందని పేర్కొన్నారు. మండల రాజకీయమంతా ము గ్గురు చేతుల మీ దుగా నడిపిస్తున్నారని, పార్టీ కోసం విశ్వాసంగా పనిచేసిన వారిని పట్టించుకోకుండా డబ్బులు ఇచ్చే వారికి నామినేటెడ్ పదవులను అ మ్ముకుంటున్నారని ఆరోపించారు. షాడో ఎమ్మెల్యే డబ్బులను బట్టి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. డబ్బు సంచులు మోసే వాళ్లకే ఎమ్మెల్యే పెత్తనం ఇచ్చారని, అది ప్రశ్నించినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. కాగా, ఎ ల్లారెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.