మమితాబైజు లైనప్ మామూలుగా లేదు. ‘ప్రేమలు’ సినిమాతో సౌత్‌లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అందాలభామ ఇప్పుడు అన్ని భాషల్నీ కవర్ చేస్తూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నది. అగ్రహీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి ఆమె నటించిన ‘జననాయగన్’ చిత్రం ఈ నెల 23న విడుదలకానున్న విషయం తెలిసిందే. ఇక సూర్యతో ఆమె నటించిన తెలుగు సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్ట్ 14న విడుదల కానున్నట్టు తెలుస్తున్నది.
దర్శకుడు వెంకీ అట్లూరి ఫ్యామిలీ, లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మలయాళంలో మమితా నటించిన ‘బెత్లెహం కుటుంబ యూనిట్’ ఆగస్ట్ 21న రిలీజ్ కానుంది. ఫహాత్ ఫాజిల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమిత సరికొత్త పాత్రలో కనిపించనున్నది. నివిన్ పౌలీ హీరో. ఈ విధంగా విజయ్, సూర్య, నివిన్పౌలీ వంటి ప్రముఖ నటుల సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన కెరీర్‌ని కొనసాగిస్తున్నది మమితా బైజు.