హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం ప్రకటన విడుదల చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించవని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పింది.