మంచిర్యాల : వచ్చే సంవత్సరం ఎప్రిల్ నెలలో జరగనున్న ప్రాణహిత పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, దేవులవాడ, రాపనపల్లి గ్రామాల సమీపంలోని ప్రాణహిత నదిని విప్ బాల్క సుమన్ సందర్శించారు.
పుష్కరాల ప్రారంభానికి తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఇతర వీఐపీలు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.
చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దేవాదయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆధ్యర్యంలో సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. రాష్ట్ర ఖ్యాతిని చాటేలా పుష్కరాల ఏర్పాట్లు ఉండాలని అధికారులను బాల్క సుమన్ ఆదేశించారు.