భూమి సర్వేకు 50 వేలు డిమాండ్.. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
జగిత్యాల జిల్లా బీర్పూర్ తహసీల్దా ర్ కార్యాలయంలో ఓ మహిళ వద్ద ఆర్ఐ రాహుల్ 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సారంగాపూర్, ఆగస్టు 13 : జగిత్యాల జిల్లా బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ వద్ద ఆర్ఐ రాహుల్ 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. బీర్‌పూర్‌లోని సిరిపురానికి చెందిన ఒంటెల మణెమ్మ మోతీనగర్, గంగసముద్రం, నూతిపల్లిలో 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసింది. భూభారతిలో 12 గుంటల భూమిని పట్టా చే యాలని దరఖాస్తు చేసింది.
విచారణ చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని తహసీల్దార్ గతేడాది జూలై 12న ఆర్ఐ రాహుల్‌ను ఆదేశించారు. భూ విచారణ కు సంబంధించి ఆర్ఐని మ హిళ కలువగా రూ.50 వేలు డిమాండ్ చేశాడు. రూ.40 వేలకు ఒప్పందం చేసుకుని, ముందుగా రూ.30 వేలు ఇవ్వాలని, పాస్‌బుక్ వచ్చిన తర్వాత రూ.10 వేలు ఇవ్వాలని చెప్పాడు. గురువారం ఆర్ఐ రాహుల్ మహిళ నివాసం ఉంటున్న ప్రాంతంలో ఆమె నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్ఐని కోర్టులో రిమాండ్ చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

