RGIA | దక్షిణాసియాలోనే బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్ట్‌గా ‘ఆర్జీఐఏ’
RGIA | శంషాబాద్( Shamshabad )లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియా( South Asia )లోనే బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్టు( Best Regional Airport ) గా నిలిచింది. ఈ క్రమంలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డు( Skytrax World Airport Award )ను ఆర్జీఐఏ( RGIA ) అందుకుంది.
RGIA | శంషాబాద్( Shamshabad )లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియా( South Asia )లోనే బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్టు( Best Regional Airport ) గా నిలిచింది. ఈ క్రమంలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డు( Skytrax World Airport Award )ను ఆర్జీఐఏ( RGIA ) అందుకుంది. ఈ విషయాన్ని జీఎంఆర్( GMR ) హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ గురువారం ప్రకటించింది. బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్టు అవార్డుతో పాటు బెస్ట్ ఎయిర్‌పోర్టు స్టాఫ్( Best Airport Staff ) అవార్డును కూడా ఆర్జీఐఏ సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్( GHIAL ) సీఈవో ప్రదీప్ పానికర్ మాట్లాడుతూ.. బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్, బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్జీఐఏ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిబ్బందికి స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాయిస్టెడ్ శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాదికి గానూ బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్టు అవార్డు, బెస్ట్ ఎయిర్‌పోర్టు స్టాఫ్ అవార్డు రావడం గొప్ప విషయమన్నారు.
స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ప్రతి ఏడాది ఎయిర్‌పోర్టు కస్టమర్ సాటిష్ఫాక్షన్ సర్వే నిర్వహించి ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాదికి గానూ 550 ఎయిర్‌పోర్టుల్లో సర్వే నిర్వహించారు. ఆరు నెలల పాటు సర్వే నిర్వహిస్తారు. కస్టమర్ల అనుభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. చెక్ ఇన్ నుంచి మొదలుకుంటే.. సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ దాకా అన్ని విషయాలపై సమాచారం సేకరించి, పరిశీలించిన తర్వాతే అవార్డులను ప్రకటిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

