Bigg Boss 10 | వంశీపై నాగార్జున ఫైర్.. వర్షిణికి క్లాస్,కెప్టెన్సీ పోటీకి ముకేశ్ అర్హత!
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వీకెండ్ ఎపిసోడ్ మరోసారి హీట్ పెంచింది. ఇంటి సభ్యులు ఈ వారం చేసిన తప్పులు, గేమ్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఒకరిపై మరొకరు చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా డిక్టేటర్స్ టాస్క్ సందర్భంగా జరిగిన వివాదం, వంశీ చేసిన వ్యాఖ్యలు నాగార్జున ఆగ్రహానికి కారణమయ్యాయి.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వీకెండ్ ఎపిసోడ్ మరోసారి హీట్ పెంచింది. ఇంటి సభ్యులు ఈ వారం చేసిన తప్పులు, గేమ్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఒకరిపై మరొకరు చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా డిక్టేటర్స్ టాస్క్ సందర్భంగా జరిగిన వివాదం, వంశీ చేసిన వ్యాఖ్యలు నాగార్జున ఆగ్రహానికి కారణమయ్యాయి. మరోవైపు వర్షిణి, ముకేశ్‌లకు గట్టిగా క్లాస్ తీసుకున్న నాగార్జున.. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ గేమ్‌లో ముకేశ్ విజయం సాధించడంతో అతడికి కీలక అవకాశం లభించింది. ఈ వారం డిక్టేటర్స్ టాస్క్‌లో సంచాలకులుగా వ్యవహరించిన శివకుమార్, వర్షిణి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇద్దరూ ఒక నిర్ణయానికి రాకపోవడంతో చివరకు గేమ్ రద్దు కావాల్సి వచ్చింది. దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. ఇద్దరూ కాస్త కాంప్రమైజ్ అయి ఉంటే గేమ్ కొనసాగేదని, చివరకు మీరే విజయం సాధించే అవకాశం ఉండేదని గుర్తుచేశారు.
గేమ్‌ను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత సంచాలకులపై ఉంటుందని, వ్యక్తిగత అభిప్రాయ భేదాలతో టాస్క్‌ను రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని నాగార్జున అభిప్రాయపడ్డారు. వంశీ, ఆర్కే ఫౌల్ గేమ్ ఆడిన సందర్భంలో వంశీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశావని వర్షిణిని నాగార్జున ప్రశ్నించారు. గేమ్ ముగిసిన తర్వాత తమ టీమ్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ ఎందుకు కాంప్రమైజ్ కాలేదని నిలదీశారు. బెస్ట్ సంచాలక్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో గేమ్ మొత్తాన్ని రద్దు చేశావా అంటూ వర్షిణి నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ కూడా తన వాదనలను గట్టిగా వినిపించారు. అనంతరం డిక్టేటర్‌గా ముకేశ్‌కు ఎన్ని మార్కులు ఇస్తారని నాగార్జున టీమ్ సభ్యులను అడిగారు. వర్షిణి మాత్రం ముకేశ్‌కు 90 మార్కులు ఇవ్వగా, మిగిలిన సభ్యులు 30, 50 వంటి మార్కులు ఇచ్చారు. మొత్తంగా ముకేశ్‌కు సగటున 50 మార్కులు వచ్చాయి. ముకేశ్ తనను వీకెస్ట్గా పేర్కొనడం నచ్చలేదని రామ్ ప్రసాద్ అతడికి కేవలం 30 మార్కులు ఇచ్చారు. ఈ వీకెండ్ ఎపిసోడ్లో వంశీ వ్యవహారశైలిపై నాగార్జున తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వర్షిణి, ముకేశ్ గురించి వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను చూపిస్తూ ఆయన ప్రశ్నించారు. ఎక్కేయడం, తొక్కేయడం అంటూ వంశీ మాట్లాడిన మాటలపై నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో వంశీ ఒక పదం ఉపయోగించినప్పుడు తాను సమర్థించానని, కానీ ఇప్పుడు అతడు మాట్లాడిన మాటలు చూస్తుంటే సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తిగా తలదించుకుంటున్నానని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో వంశీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే నాగార్జునకు, వర్షిణికి క్షమాపణలు చెప్పాడు. మరోవైపు డిక్టేటర్‌గా త్రిగుణ్ వ్యవహరించిన తీరుపై నాగార్జున సంతృప్తి వ్యక్తం చేశారు. అతడి టీమ్ సభ్యులు సగటున 90 మార్కులు ఇవ్వడంతో త్రిగుణ్‌ను అభినందించారు. ఈ వారం టాస్కుల్లో కొందరు సభ్యులు వివాదాలకు దూరంగా ఉంటూ మంచి ప్రదర్శన ఇచ్చారని పేర్కొన్నారు.
వీకెండ్ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం వర్షిణి, ముకేశ్ మధ్య జరిగిన గేమ్. ఈ టాస్క్‌లో విజయం సాధించిన సభ్యుడు వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్షిప్కు అర్హత సాధిస్తాడని నాగార్జున ప్రకటించారు.
ఇద్దరి మధ్య జరిగిన పోటీలో వర్షిణిని అడ్డుకుంటూ ముకేశ్ విజయం సాధించాడు. దీంతో వచ్చే వారం కెప్టెన్సీ పోటీకి ముకేశ్‌కు అవకాశం దక్కింది. మిగిలిన ఇంటి సభ్యుల కెప్టెన్సీ కంటెండర్‌షిప్ గేమ్స్ ఆదివారం ఎపిసోడ్లో కొనసాగనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వంశీపై నాగార్జున ఫైర్.. వర్షిణికి క్లాస్,కెప్టెన్సీ పోటీకి ముకేశ్ అర్హత!
Mining Mafia | మాఫియాతో మైనింగ్ శాఖ కుమ్మకు.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లకు గండి!
Guidance Tamil Nadu | ‘పెట్టుబడుల’ లీక్‌పై రాజకీయ ప్రకంపనలు.. ఏపీ, తమిళనాడు మధ్య వివాదం ముదురుతోందా?
Rajasthan Elections | రాజస్థాన్‌లో బీజేపీకి ఘోర పరాభవం.. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70% సీట్లలో పరాజయం
Raja Gopal Reddy | రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్ పిలుపు.. 23న ఏం జరగబోతున్నది?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

