హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరిచేస్తూ ఇచ్చిన తీర్పుపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది టీచర్లపై ప్రభావం చూపనున్నదని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం, ఎన్సీటీఈ, రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్లు వేయాలని కోరారు.
10 వరకు గ్రూప్-3 వెబ్ ఆప్షన్ల నమోదు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రూప్-3 పోస్టుల భర్తీలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు టీజీపీఎస్సీ అవకాశమిచ్చింది. అక్టోబర్ 10 సాయంత్రం 5:30లోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మొత్తం 4,421 మంది అభ్యర్థులతో పాటు, స్పోర్ట్స్ కోటాలో మరో 81మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది.