హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఎస్సీ సంక్షేమ శాఖపై శాసనసభా కమిటీ హాల్లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ సమీక్ష నిర్వహించనున్నది. ఇందులో శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నదని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.