హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : స్కూళ్లలో అమలవుతున్న అంతర్గత మూల్యాంకనాన్ని సమీక్షించాలని సీబీఎస్ఈ కోరింది. ఈ మూల్యాంకన విధానాలను సమీక్షించాలని బుధవారం ఈ మేరకు స్కూళ్లకు సూచనలిచ్చింది. నిరుడు ఫలితాల్లో దేశంలోని సుమారు 500 పైచిలుకు పాఠశాలల్లో 50శాతం కంటే విద్యార్థులు సాధించిన థియరీ, ప్రాక్టికల్స్ మార్కుల్లో తేడాలుండటాన్ని సీబీఎస్ఈ గుర్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించిన బోర్డు ఆయా పాఠశాలలు సమీక్షించుకోవాలని సూచించింది. ఇక ప్రాక్టికల్స్ పరీక్షల సమయంలో కచ్చితమైన మూల్యాంకనాన్ని చేపట్టాలని సూచించింది.