పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అర్హత నిబంధనలను సీబీఎస్ఈ కఠినతరం చేసింది. పరీక్షలు రాయడానికి అర్హత పొందాలంటే విద్యార్థులు కనీసం 75 శాతం తరగతులకు హాజరై ఉండాలని తెలిపింది.
స్కూళ్లలో అమలవుతున్న అంతర్గత మూల్యాంకనాన్ని సమీక్షించాలని సీబీఎస్ఈ కోరింది. ఈ మూల్యాంకన విధానాలను సమీక్షించాలని బుధవారం ఈ మేరకు స్కూళ్లకు సూచనలిచ్చింది.