జడ్చర్ల, నవంబర్ 6: మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లి శివారులోని సెజ్‌లో ఫాంపాండ్స్‌ను బుధవారం రెవెన్యూ అధికారులు పూడ్చివేశారు. ఉచిత విద్యుత్తును వినియోగి స్తూ.. భూగర్భ జలాలను కొల్లగొడుతూ వ్యవసాయ బోరుబావుల నుంచి సెజ్‌లోని పరిశ్రమలకు ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నారన్న ఫిర్యాదుతో మంగళవారం లోకాయుక్త అధికారులు పర్యటించారు. పోలేపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి నీటిని సరఫరా చేసే బోర్లను గుర్తించారు. రెవెన్యూ, విద్యుత్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో బుధవారం వారు జేసీబీ సహాయంతో ఫాం పాండ్స్‌ను పూడ్చివేయించారు.