హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth ) ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు( Supreme Court ) సాక్షిగా బట్టబయలయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సోమవారం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంపై హరీష్ రావు ఒక వీడియోను విడుదల చేశారు.
విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం – నల్లమల సాగర్‌కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ నిజస్వరూపం, ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంది
నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం… https://t.co/FzVAUYq7ii pic.twitter.com/8HIHy4RDPR
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2026
నాడు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ మాత్రం దానికి ఉత్తమ్ కుమార్ సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? అంటూ ప్రశ్నించారు.
సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథేనని అన్నారు.
బలహీనమైన రిట్టు వేసి సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ చంద్రబాబుకు గురు దక్షణ చెల్లించుకున్నాడని విమర్శించారు. గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తప్పుకుండా పోరాటం చేస్తామని హరీష్ రావు వెల్లడించారు.