Mining | అవును.. రాఘవ కన్స్ట్రక్షన్స్ది తప్పే!..అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్,మైనింగ్ మంత్రి వివేక్ అంగీకారం
రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమంగా మైనింగ్(క్రషింగ్) చేసిన ట్టు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా సీఎం రేవంత్ అంగీకరించారు. ఆయనతో పాటు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెం కటస్వామి సైతం అంగీకరించారు.
- అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్,మైనింగ్ మంత్రి వివేక్ అంగీకారం
- కంపెనీ చేసిన అక్రమాలను స్వయంగా వెల్లడించిన మంత్రులు
- నోటీసులిచ్చి పన్నులు వసూలు చేసినట్టు మంత్రుల ఒప్పుకోలు
- అక్రమ మైనింగ్‌పై అసెంబ్లీ హౌస్ కమిటీ వేసేందుకు నిరాకరణ
హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమంగా మైనింగ్(క్రషింగ్) చేసిన ట్టు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా సీఎం రేవంత్ అంగీకరించారు. ఆయనతో పాటు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెం కటస్వామి సైతం అంగీకరించారు. అ సెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్ చేసిన అక్రమాలను ఇద్దరు మంత్రులు స్వ యం గా వెల్లడించారు. సదరు కంపెనీ మంత్రి పొంగులేటి కుటుంబానిదేననే ఆరోపణలున్న నేపథ్యంలో ఒక మంత్రి కి సంబంధించిన కంపెనీ అక్రమాలను సీఎం సహా మైనింగ్ శాఖ మంత్రి ఒప్పుకోవడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వంలో, కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్ కల్పించుకొని మరీ రాఘవ కన్స్ట్రక్షన్ తప్పు చేసిందని వెల్లడించడమే గాక.. అనుమతులు లేకుండా క్రషర్ నడుతున్నట్టు తెలిపారు.
మైనింగ్ అండ్ జియాలజీ రంగారెడ్డి ఏడీ ఫిర్యాదు ఆధారం గా కంపెనీ నుంచి బకాయిలు వసూలు చేశామని తెలిపారు. సదరు కంపెనీ అక్రమంగా మైనింగ్ చేసిందని అంగీకరించడం గమనార్హం. అక్రమ క్రషింగ్‌పై రాఘవ కంపెనీకి నోటీసులు ఇచ్చినట్టు తనకు తెలియదని ఆ శాఖ మంత్రి వివే క్ చెప్పడం గమనార్హం. ఇప్పటివరకు రూ.1.22 కోట్లు, మరో అంశంలో రూ.1.52 కోట్ల బకాయిలను వసూలు చేశామని.. మరో రూ.4లక్షలు చెల్లించలేదని, ఈ మాత్రం దానికే ఇంత రా ద్ధాంతం చేస్తారా అంటూ ప్ర శ్నించారు. అక్రమ మైనింగ్‌పై నిగ్గుతేల్చేందుకు అసెంబ్లీ హౌస్కమిటీని వేయాలనే బీఆర్ఎస్ డిమాండ్‌ను కొట్టిపారేశారు. ‘ఈ చిన్న విషయానికే హౌస్ కమిటీకి ఒప్పుకొనేది లేదు. శాఖా పరమైన విచారణ చేస్తాం.. అందులో ఏమై నా తేలితే అప్పుడు హౌస్ కమిటీ వేస్తాం’ అంటూ మంత్రి ప్రకటించారు. మంత్రి అక్రమాలు ఎక్కడ ప్రజలకు తెలుస్తాయోననే హౌస్ కమిటీ వేసేందుకు సర్కార్ వెనుకంజ వేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

