Revanth Reddy | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి నోరుజారారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత రాహుల్ అసువులు బాసినట్లు నోరుజారారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేత వీ హనుమంతరావు తదితర నేతలతో కలిసి రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో తీవ్రవాదాన్ని అణచివేయడంలో, దేశ సమగ్రతను కాపాడటంలో, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ అసువులు బాసారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన రాజీవ్‌గాంధీకి బదులుగా రాహుల్‌గాంధీ అని చెప్పటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.