హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాపాలన కాదని నిజమైన హిట్లర్ పాలన ( Hitlers rule ) కు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నిదర్శనమని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ( Manne Krishank ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పాలనపై విరుచుకు పడ్డారు.
హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా పెట్టానని, గాజా-ఇరాన్ తరహాలో పేదల ఇండ్లు కూల్చామని స్వయంగా ఒప్పుకున్న వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే తమపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులకు పాల్పడుతున్నారని ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. ఇది నిజమైన హిట్లర్ పాలనకు నిదర్శనమని ఆరోపించారు.హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ ప్రజలు ఇప్పటికీ క్షమాపణ చెబుతూనే ఉన్నారని, అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి స్ఫూర్తి అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
2015 నుంచి ఇప్పటి వరకు కంటోన్మెంట్‌కు ఎన్నికలు నిర్వహించకుండా బీజేపీ నాయకులు నామినేటెడ్ సభ్యులను నియమిస్తు వస్తుందని ఆరోపించారు. నామినేటెడ్ పదవుల విషయంలో ఆ పార్టీకి చెందిన నాయకుల మధ్య గొడవలు పడుతూ ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన మరో ఎంపీ బ్యానర్లు కట్టిస్తున్నాడని , కంటోన్మెంట్ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఈటలను ప్రశ్నించారు.