ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లు
పంటలకు నీరందించాలని కోరిన బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి నెత్తురు రుచిమరిగిన తోడేలులా ప్రవర్తిస్తున్నడు
- బాబు మెప్పు కోసం రాష్ర్టాన్ని ఎండబెడుతున్న రేవంత్‌రెడ్డి
- రక్తం ఇస్తున్నాం.. రైతులకు నీళ్లు ఇవ్వు: మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, జూలై 16: ‘పంటలకు నీరందించాలని కోరిన బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి నెత్తురు రుచిమరిగిన తోడేలులా ప్రవర్తిస్తున్నడు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రకు నీళ్లు ఇస్తూ.. తెలంగాణను ఎండబెడుతూ కన్నీళ్లు పెట్టిస్తున్నాడు’ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. పొలాలకు నీళ్లు ఇవ్వమని అడిగితే బీఆర్ఎస్ నాయకుల రక్తం చల్లాలని ఇటీవల రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గ్రంథాయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా సుంకె మా ట్లాడుతూ.. తెలంగాణ రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులు ఎంత రక్తమైనా ఇస్తారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి ఇక్కడి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయడానికే రేవంత్‌రెడ్డి నీటిని ఎత్తిపోయడంలేదని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

