చిక్కడపల్లి, నవంబర్ 19: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇంతవరకు 40% మందికే రుణమాఫీ చేశారని, మిగతా వారిని నిండా ముంచారని తెలంగాణ రైతుకూలీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతుకూలీ పోరాట సమితి(టీఆర్సీపీఎస్) ఆధ్వర్యంలో డిసెంబర్ 9న సుందర య్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు కరపత్రం ఆవిష్కరించి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లెక్కల ప్రకారం రా ష్ట్రంలోని రైతులందరికీ రుణమాపీ 49,500 కోట్లు అంచాన వేయగా, దాన్ని రూ.31 వేల కోట్లకు కుదించి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మిగిలిన రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాం డ్ చేశారు. లగచర్ల ఘటనపై ప్రజాకమిటీ విచారణకు ఆదేశించాలని, ఫా ర్మా అనుమతులన్నీ రద్దు చేసి హైదారాబాద్‌తోపాటు రాష్ట్రంలోని భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాది కట్టా భగవంత్‌రెడ్డి, రైతుకూలీ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు జీ వెంకటేశ్వర్రావు, రవిచంద్ర పాల్గొన్నారు.