హైదరాబాద్, జనవరి 15(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇదేరోజు అక్కడి ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎంతోపాటు కొందరు మంత్రులు, రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనతో కలిపి రేవంత్రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటివరకు 13 నెలల కాలంలో 30సార్లు ఢిల్లీకి వెళ్లడం గమనార్హం.