హైదరాబాద్: పోలీసుల సహకారంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలవాని కాంగ్రెస్ చూస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao) విమర్శించారు. తమ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలను పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో జరిగివి ఉపఎన్నికలు కాదని, సీఎం రేవంత్ రెడ్డి కుట్రలని ఫైర్ అయ్యారు. ఉపఎన్నికలో రిగ్గింగ్ చేసుకోవడానికి అధికారపార్టీ బహిరంగంగా బరితెగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి బీఎస్సీ కాలనీలోని ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే పోలీసులు పెద్ద ఎత్తున సోదాలకు వచ్చారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో ఓటమి ఖాయమని జీర్ణించుకోలేని రేవంత్రెడ్డి చేస్తున్న కుట్ర ఇదన్నారు. నియోజకవర్గ పరిధిలో లేని ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారని చెప్పారు.
ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. ఈ అరాచకాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికల పరిధిలో లేని ఇండ్లలోనూ దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. తమ పార్టీ ముఖ్య కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు పెడదామని పోలీసులు వచ్చారని, తాము రాకుండా ఉంటే పెట్టేవారేనని చెప్పారు. తమ ఇండ్లలో డబ్బులు పెట్టి ఇరికించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ధ్వజమెత్తారు. కూకట్పల్లిలో కిరాయికి తీసుకుని ఉంటున్నానని చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ పరిధిలో లేకున్నా సోదాలు చేస్తున్నాని విమర్శించారు. ఎవరూ లేనప్పుడు వచ్చి ఇండ్లలో డబ్బులు పెడితే ఎవరు బాధ్యులన్నారు. తమ ఇంట్లో సోదాలకు ఏ అనుమతితో వచ్చారని పోలీసులను ప్రశ్నించినట్లు చెప్పారు. బోరబండ, మధురానగర్ పోలీస్టేషన్లకు పిలిచి బెదిరిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో జరిగివి ఉపఎన్నికలు కాదని, సీఎం రేవంత్ రెడ్డి కుట్రలని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో పోలీసులు ఇలా బెదిరించడం దుర్మార్గమన్నారు. ఉపఎన్నికలో రిగ్గింగ్ చేసుకోవడానికి అధికారపార్టీ బహిరంగంగా బరితెగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని, తక్షణం సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనతో రౌడీయిజం, అరాచకాలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విమర్శించారు. తన సొంత ఇంటికి వెళ్లనీయకుండా పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అలవిగాని హామీలిచ్చి అమలు చేయడం చేతకాకనే ఇలాంటి చర్యలకుపాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ గుండాయిజం అర్ధమైపోయిందని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని మా ఇండ్ల మీదకు పోలీసులు రావడం చట్టరీత్యా నేరం
నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.. ఇండ్ల మీదకి పోలీసులను పంపుతున్నారు
ఇది గుండాల రాజ్యం.. ఈ రాజ్యంలో ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తామన్నట్లు బెదిరిస్తున్నారు
పోలీసులను వాడుకొని జూబ్లీహిల్స్… https://t.co/uVUZCBmbRI pic.twitter.com/9irbdWkw8Q
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2025