Revanth Reddy | హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయన షెడ్యూల్ ఖరారు అయినట్టు సమాచారం. గత నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. తాజా ఆయన మళ్లీ ఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో భాగంగానే మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది.
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కేంద్రం గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ కానున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 37వసారి కావడం గమనార్హం. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నది.