Chandrababu | చంద్రబాబును కాపాడేందుకు రేవంత్ రెడ్డి రాయబారం.. మరోసారి గురుశిష్యుల బంధం బట్టబయలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన అరెస్ట్ సంగతి నెల క్రితమే తెలుసా? అరెస్టును తప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చంద్రబాబు కోసం రాయబారం నెరిపారా? ఇందులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇన్వాల్వ్ అయ్యారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' మంగళవారం సంచలన కథనాన్ని ప్రచురించింది.
Chandrababu | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన అరెస్ట్ సంగతి నెల క్రితమే తెలుసా? అరెస్టును తప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చంద్రబాబు కోసం రాయబారం నెరిపారా? ఇందులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇన్వాల్వ్ అయ్యారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ మంగళవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం రేవంత్‌రెడ్డి ఇటీవల కర్ణాటకకు వెళ్లి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు, డీకే శివకుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్టు కథనంలో పేర్కొంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిపింది.
ఈ కథనాన్ని బట్టి బాబు, రేవంత్ మధ్య బంధం మరోసారి బట్టబయలైంది. ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో తనది సహచర బంధమే తప్పా.. తమ మధ్య ఎలాంటి గురుశిష్యుల బంధం లేదు’ అంటూ రేవంత్ చెప్పిన మాటలు పూర్తి అబద్ధమని తేలిపోయింది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఇలా రేవంత్‌రెడ్డి తన గురువును కాపాడుకొనేందుకు తాపత్రయ పడుతున్నారనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇద్దరి మధ్య బంధం విడిపోయేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రేవంత్‌రెడ్డి చంద్రబాబు షాడోలా పని చేస్తున్నారనే ఆరోపణలకు ఇది మరింత బలం చేకూరుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

