హైదరాబాద్, ఏప్రిల్14 (నమస్తే తెలంగాణ): గిగ్ వర్కర్ల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ దిశగా అంబేద్కర్ జయంతి సందర్భంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్-2025 యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లుకు రూపకల్పన చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ చట్టం తెలంగాణ రాష్ట్రమంతటా వర్తిస్తున్నదని పేర్కొన్నది. ఇది ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించిన తేదీన అమల్లోకి రానున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుందని వెల్లడించారు.