హైదరాబాద్, మార్చి 19 (నమస్తేతెలంగాణ): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ.. తనకంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డినే ఎక్కువగా నమ్ముతారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రిని బుధవారం ఎస్సీ సంఘాల నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎస్సీ సంఘాల నేతలు పాల్గొని సీఎంకు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.