రవీంద్ర భారతి,ఏప్రిల్ 5 : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్‌రాం జయంతిని పురస్కరించుకొని శనివారం బషీర్‌బాగ్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. జగ్జీవన్‌రాం అడుగుజాడల్లో యువత నడవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీలు వీ హనుమంతరావు, అంజన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి , మాజీ కార్పొరేటర్లు మమతాసంతోష్‌గుప్తా, పరమేశ్వరీసింగ్ పాల్గొన్నారు.