హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రిగా 23 నెలల క్రితం బాధ్యతలు తీసుకున్న అనంతరం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 56వ సారి. ఢిల్లీలో గురువారం జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక’ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపాయి.
ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఆయన గురువారం రాత్రే తిరిగి హైదరాబాద్ రానున్నారు. గత నెల 25వ తేదీన రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. పదిహేను రోజుల వ్యధిలో ఆయన ఢిల్లీకి వెళ్లటం ఇది రెండోసారి. గడిచిన 23 నెలల్లో సగటున ప్రతి పన్నెండు రోజులకోసారి సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత తక్కువ సగటుతో ఢిల్లీ పర్యటనలు చేసిన దాఖలాలు లేవు.