హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1000 కోట్లు అప్పు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదన పెట్టింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సేకరిస్తామని 35 ఏండ్లకు సెక్యూరిటీ బాండ్లు పెట్టింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్రెడ్డి సర్కారు.. ఈ నెల ఐదో తేదీ నాటికి ఒక్క ఆర్బీఐ నుంచే రూ.30,900 కోట్లు రుణ సమీకరణ చేసింది.