హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిసెంబ ర్ 1నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. సచివాలయంలో శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
7, 8, 9న సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 9న సచివాలయంలో లక్షమంది మహిళాశక్తి ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.