హైదరాబాద్: కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రాసిన సమయంలో అందెశ్రీతో జరిపిన సంభాషణలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందని చెప్పారు. స్వరాష్ట్ర సాధనలో అందెశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.