హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతలు అప్పగించింది. శనివారం విడుదల చేసిన ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు చోటు కల్పించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ చేపట్టిన విచారణ సందర్భంగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన అనేకమంది తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని తెలిపారు. దానం నాగేందర్ సైతం తాను కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని అంగీకరించకుం డా ఊగిసలాట ధోరణి కనబరిచారు. తాజాగా జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరును చేర్చడం చర్చనీయాంశమైంది.