హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి రెడ్యానాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో భూముల కోసం పార్టీ మారారని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తనకు గాని, తన కూతురుకు గాని హైదరాబాద్‌లో సెంట్ భూమి కూడా లేదని అన్నారు.
గతంలో కొంత భూమి ఉండగా దానిని విక్రయించామని స్పష్టం చేశారు. గతంలోనూ ఇదే భూమిపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారని అన్నారు. హైదరాబాద్‌లో భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. రేవంత్ రెడ్డి నిరూపించకుంటే పది చెప్పు దెబ్బలు తింటడా అని అన్నారు.డోర్నకల్ ప్రజలకు తన నీతి నిజాయితీ ఏమిటో తెలుసని పేర్కొన్నారు.
పీసీసీ పదవి ని డబ్బు తో కొనుక్కుని కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించాడని విమర్శించారు. రేవంత్ పీసీసీ అయిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారని ఆరోపించారు. గోడలకు రంగులేసుకునే రేవంత్ వేల కోట్ల కు శ్రీమంతుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు.