హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి ఒప్పందాలు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఆయా కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (MOU) ప్రభుత్వ విశ్వసనీయతకు ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. నాలుగు నెలల క్రితమే ఏర్పడ్డ కం పెనీలు, కనీస మూలధనం లేని సంస్థలు రాష్ట్రంలో రూ. వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెడ్తామంటూ ముందుకు రావ డం, వాటితో ప్రభుత్వం ఓ అంతర్జాతీ య సదస్సులో ఒప్పందాలు చేసుకోవ డం విస్మయం కలిగిస్తున్నది. ఇవన్నీ ని జంగా వచ్చే పెట్టుబడులనే లేక.. ఓ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాము కాబట్టి.. ఆ స్థాయికి తగిన రీతిలో పెట్టుబడులు ఆహ్వానించామని చెప్పుకొనేందుకు ప్ర భుత్వం బిల్డప్ ఇస్తున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత రెం డేండ్లలో ప్రభుత్వం చేసుకున్న అనేక పె ట్టుబడి ఒప్పందాలు కార్యరూపం దాల్చకపోవడమే దాని పనితీరుపై సందేహాలకు తావిస్తున్నది.
మూలధనం 10 లక్షలు..పెట్టుబడి 4వేల కోట్లు!
నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని కావూరీహిల్స్‌లో ఏర్పాటైన ఓ కంపెనీ ఏకంగా రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం, ఆ విషయాన్ని ప్రభుత్వం గొప్పగా ప్రకటించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నా యి. అతిరథ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కానీ ఆ సంస్థ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఈ కంపెనీ ఈ ఏడాది జూలై 30న రిజిస్టర్ అయ్యిం ది. దీని మూలధనం రూ.10 లక్షలు మాత్రమే. అలాంటి కంపెనీ ఏకంగా రూ.4,000 కోట్ల పెట్టుబడి పెడ్తానంటూ టీజీ రెడ్కోతో ఒప్పందం చేసుకున్నది. 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పెడ్తామని ప్రకటించింది. ప్ర భుత్వం చేసుకుంటున్న ఒప్పందాల్లోని డొల్లతనానికి ఇది మచ్చుతునక మాత్రమే.
జానారెడ్డి కొడుకు కంపెనీ 5,600 కోట్ల పెట్టుబడి
మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డికి చెందిన ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ప్రై. లి కూడా టీజీ రెడ్కోతో ఒ ప్పందం చేసుకున్నది. 500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ప్లాంట్ పె డ్తామని, రూ.5,600 కోట్ల పెట్టుబడి పెడ్తామని వెల్లడించింది. ఈ కంపెనీ కేవలం రూ.లక్ష మూలధన పెట్టుబడితో మొదలయ్యింది. అలాంటిది 5,600 కోట్ల పెట్టుబడి పెడ్తామని ముందుకు రావడం విస్మయం గొలుపుతున్నది.
ఆదాయం 53వేలు..పెట్టుబడి 31వేల కోట్లు!
రూ.31.5వేల కోట్ల పెట్టుబడి పెడ్తామంటూ టీజీ రెడ్కోతో ఒప్పందం చేసుకున్న మరో కంపెనీ పేరు యాక్సిస్ ఎన ర్జీ వెంచర్స్ ఇండియా. ఈ కంపెనీ 2750 మెగావాట్ల పునరుత్పాదక విద్యు త్తు ఉత్పత్తికి ఎనర్జీపార్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ, ఈ కంపె నీ ఆర్థిక వనరులు, శక్తి సామర్థ్యాలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కంపెనీ గత మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సం పాదించిన ఆదాయం 53 వేల కోట్లు మాత్రమే. ఇలాంటి కంపెనీ రూ.31వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని ప్రకటించడం అనేక ప్రశ్నలకు తావిస్తున్నది.
గతంలోనూ ఇంతే..!
దావోస్ మొదలు అనేక సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాల్లో ఏవీ కార్యరూ పం దాల్చలేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో దావాస్‌లో స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి అది అసలు కం పెనీయే కాదు. ఆ కంపెనీలో పెట్టుబడిదారుగా ఉన్నది సీఎం రేవంత్ కుటుంబసభ్యులే. గోడీ ఇండియా కంపెనీతో ఒ ప్పందం చేసుకున్నట్టు కూడా గతంలో ప్రకటించారు. రూ.8వేల కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు. కానీ, ఆ కంపెనీ రూపాయి పెట్టింది లేదు. ఇదే కోవలో ఉర్సా క్లస్టర్ ప్రై. లి. అనే కంపెనీతో ఒ ప్పందం చేసుకున్నారు. రూ.5 వేల కోట్ల పెట్టుబడి వస్తుందని ఘనంగా ప్రకటించారు. కానీ, ఆ కంపెనీ ఇప్పటివరకు నయా పైసా పెట్టలేదు. ఆ కంపెనీ ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక్క బ్యాలెన్స్‌షీట్ కూడా పూర్తి చేయని కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ విమర్శించారు. సీఎం బ్రోకర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు.