హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. అప్పు లు చేయడంలో మాత్రం అడ్డూ అదుపూ లేకుండా ముందుకు సాగుతున్నది. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి రెండున్నర నెలల్లోనే రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రూ.17,400 కోట్ల అప్పు తెచ్చింది. దీనిలో భాగంగా మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.4 వేల కోట్ల రుణం తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.
33 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 34 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 35 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 36 ఏండ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్ల చొప్పున 7.09% వార్షిక వడ్డీతో ఈ రుణాలు సమీకరించినట్టు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.64,539 కోట్ల రుణాలు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్రెడ్డి సర్కారు.. తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.14 వేల కోట్ల రుణాల కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. అందులో భాగంగా ఏప్రిల్ నెలలో మూడు దఫాల్లో రూ.4,400 కోట్లు, మే నెలలో రెండు విడతల్లో రూ.4,500 కోట్లు, జూన్లో ఇప్పటికే మూడు దఫాల్లో రూ.8,500 కోట్ల రుణాలు సమీకరించింది. దీంతో ప్రతిపాదించిన మొత్తం కంటే రేవంత్రెడ్డి సర్కారు అధికంగా అప్పు తీసుకున్నట్టయింది.
గత రెండున్నర నెలల్లో ఆర్బీఐ నుంచి రేవంత్ సర్కారు తెచ్చిన అప్పులు ఇవీ..