Scrutiny of Nominations | రాష్ట్రంలో ఇవాళ నామినేషన్ల స్క్రూటినీ.. 119 నియోజకవర్గాల్లో పరిశీలించనున్న అధికారులు
Scrutiny of Nominations | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) పరిశీలించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ మొత్తం నామినేషన్ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించనున్నారు. అదేవిధంగా ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉన్నది. కాబట్టి పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థు ఆరోజు వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. ఈ నామినేషన్ ఉపసంహరణ కూడా పూర్తయితే ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది కచ్చితంగా తేలనుంది.
కాగా, తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేరోజు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

