హైదరాబాద్, మే31(నమస్తేతెలంగాణ): టీజీఎస్ ఆర్టీసీలో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-ఆపరేషన్స్ రఘునాథరావు, చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్(ఆపరేషన్స్) జీవన్ప్రసాద్తో పాటు మరో ఏడుగురు రిటైర్డ్ కాగా బస్‌భవన్‌లో శుక్రవారం వీడోలు కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించింది. ముఖ్యఅతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరై ఉద్యోగ విరమణ పొందిన వారందరినీ సన్మానించారు. విరమణ పొందినవారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కమర్షియల్ నగేశ్, బీఆర్సీ మూర్తి (అకౌంట్స్ ఆఫీసర్), రవీందర్రావు (ఏఎంఎఫ్), హరికిషన్(సూపరింటెండెంట్), హఫీజ్ (సీనియర్ అసిస్టెంట్), కృష్ణ(రోటిన్ క్లర్),బాలిరెడ్డి (రికార్డు ట్రేసర్) ఉన్నారు. కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్‌కుమార్, ఫైనాన్స్ అడ్వయిజర్ విజయపుష్ప, హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు పాల్గొన్నారు.