హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వక్ఫ్‌బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని టీఎన్జీవో కోరింది. ఈ మేరకు మంగళవారం టీఎన్జీవో ప్రతినిధులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి వినతపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచిందని గుర్తుచేశారు. అయితే వక్ప్‌బోర్డులో మాత్రం అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులను వక్ఫ్‌బోర్డు ఉద్యోగులకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీవో అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు ముజీబ్ తదితరులు ఉన్నారు.